Tuesday, May 19, 2026
E-PAPER
Homeకరీంనగర్తుపాకి తూటాగా ప్రజల్లోకి కవితక్క

తుపాకి తూటాగా ప్రజల్లోకి కవితక్క

- Advertisement -

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన పేరిట తుపాకి తూటాగా కవితక్క ప్రజల్లోకి వస్తుందని తెలంగాణ రక్షణ సేన ఇంచార్జ్ సతీష్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కవితక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిందని కవితక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంచ జన్యం పేరిట ఉచిత విద్య, ఉచిత వైద్యం, మొదటి ఏడాదిలోనే యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలు, రైతులకు ఉచిత విద్యుత్, సామాజిక న్యాయం కల్పించడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో కవితక్క నూతన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక అమలు గాని హామీలు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా కేసీఆర్ కుటుంబం ఎదిగిందని ప్రజలకు చేసింది మాత్రం శూన్యమని ఆయన పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచిన దున్నపోతుపై నిద్రపోతున్నట్లు ఉన్నారే తప్ప వారు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. పంచ జన్యం పేరిట ఇచ్చిన ఐదు హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గర కట్టేసి కొట్టాలని కవితక్క పేర్కొన్నారని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో జెండా పండుగ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. సమావేశంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు గుంటుక సంపత్, అబ్దుల్ మజీద్, కుసుమ విష్ణు, బుస్స వేణు, సంక పెళ్లి సుమలత, సుధాకర్ శర్మ, కుసుమ విష్ణు, కూర సురేష్, నూనె మల్లేష్ యాదవ్, కదిరి భాస్కర్ గౌడ్, కులేరు వినయ్, చెరుకుపల్లి శైలజ, బాయికాడ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -