చెమటకాయలు, సన్‌బర్న్.. సమస్య ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జుని నేరుగా అప్త్లె చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత రోజ్‌వాటర్‌తో కాసేపు మృదువుగా రుద్దుకోవాలి. అనంతరం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా చెమటకాయలు, సన్‌బర్న్.. వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట.
ఇలా కూడా.. సమస్య ఉన్న ప్రాంతంలో తేనె రాసి కాసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. గుప్పెడు వేపాకులు తీసుకొని తగినన్ని నీళ్లు జత చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి కాసేపు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేయాలి. రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో సమస్య ఉన్న ప్రాంతంలో రోజుకి 2 లేదా 3 సార్లు మృదువుగా రుద్దుకోవాలి.
పుచ్చకాయ గుజ్జు లేదా రసాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి కాసేపు ఆరనిచ్చి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలన్నీ వేసవిలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ఎండాకాలంలో ఈ చిట్కాలు పాటించడంతో పాటు వీలైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చంటున్నారు.
ఈ వేసవి సమస్యలకు.. చెక్ పెట్టాలంటే
- Advertisement -
- Advertisement -



