మహారాష్ట్రలోని పుణేలో దారుణం
పుణే: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. సామాన్యులపైనే కాదు మహిళా లాయర్లపై దుండగులు బరితెగి స్తున్నారు. తాజాగా మహారాష్ట్ర లోని పుణే లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులో తనపై అత్యాచారం జరిగిందంటూ ఓ మహిళా లాయర్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాకు చెందిన మహిళా లాయర్ ఓ పని మీద ఆదివారం పుణేకు వచ్చారు. అక్కడే ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారు. హోటల్‌లోని పబ్‌లో మద్యం తాగుతుండగా.. పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారంతా మరో పబ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో కారులో వెళ్తుండగా.. వారిలో ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని మహిళా న్యాయవాది ఆరోపించారు. ఆ తర్వాత వారు మరో ఇద్దరిని అక్కడికి పిలిచారని.. వారు కూడా తనను లైంగిక వేధింపులకు గురిచేశారని తెలిపారు. కాగా.. మహిళా లాయర్ ఫిర్యాదు మేరకు అఘాయిత్యం, లైంగిక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబరు ఆధారంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అభిషేక్ నవనాథ్ ముక్తే, ధనుంజయ్ సోర్టే, ఆదేశ్ శిందేలుగా గుర్తించారు. నాలుగో నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



