- Advertisement -
గరిష్ట వయోపరిమితి 44 ఏండ్లకు పెంపు
మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీసు తదితర యూనిఫామ్ సర్వీస్ లకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ట వయోపరిమితిని పదేండ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో రెండేండ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -



