Wednesday, May 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎప్ సెట్ ఫలితాల్లో అర్హత సాధించిన1,715 మంది మైనారిటీ గురుకుల విద్యార్థులు

ఎప్ సెట్ ఫలితాల్లో అర్హత సాధించిన1,715 మంది మైనారిటీ గురుకుల విద్యార్థులు

- Advertisement -

స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ముఖర్రం అహ్మద్ కు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఎప్ సెట్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ గురుకుల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో రాష్ట్రంలో తొలి ర్యాంకుతో పాటు 1,715 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 2,273 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 720 మంది ఇంజినీరింగ్ విభాగంలో, 988 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అర్హత సాధించారు. మైనారిటీ గురుకుల విద్యార్థులు సాధించిన విజయాల పట్ల మైనారిటీ గురుకుల కార్యదర్శి బి. షఫీవుల్లా, మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ పాషాలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన ముఖర్రం అహ్మద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -