అనాదలైన ముగ్గురు పిల్లలు
నవతెలంగాణ – మల్హర్ రావు
వడదెబ్బతో గొట్టం ఉమ (38) మహిళ కూలి మృతి చెందిన సంఘటన మండలంలోని మల్లారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల,స్థానికుల పూర్తి కథనం ప్రకారం ఉమ-లక్ష్మయ్య ఆదివాసీ గిరిజన దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఇద్దరు కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఉమ గత నాలుగు రోజుల క్రితం కూలి పనికి పోయి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలతిప్పుతొందని వాంతులు, విరోచనాలు చేసుకొందని వెంటనే చికిత్స కోసం భూపాలపల్లి ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళమని సూచించారు. అయితే చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ మృతితో 8 ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులు అనాదలైయ్యారు. దయనీయులైన దాతలు అనాధ పిల్లలను ఆర్థికంగా చేయుతనివ్వాలని, అలాగే ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
వడదెబ్బతో మహిళ కూలి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



