Wednesday, May 20, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంలో టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపనకు విచ్చేస్తున్న  సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అదనపు ఎస్పి లక్ష్మీనారాయణ, జిల్లా స్థాయి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ , రెవెన్యూ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,  ఇ ఇ అర్ అండ్ బి ,  ఎస్సీ ఇరిగేషన్, ట్రాన్స్ పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ,  ఈ ఈ పంచాయతీ రాజ్, వైద్య శాఖ, ట్రాన్స్ కో , హార్టికల్చర్  డిపిఆర్ఓ,సివిల్ సప్లై , ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు అధికారులు  సంపూర్ణ సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా పనులు పూర్తి చేయాలన్నారు.వేదిక వద్ద అన్ని ఏర్పాట్లుచేయాలని టెంపుల్ ఈ ఈ కోరారు. టెంపుల్ సిటీ వద్ద హెలిప్యాడ్  అన్ని ఏర్పాట్లుచేయాలని ఆర్ అండ్ బి అధికారులను, భద్రత ఏర్పాట్లు, శాంతి భద్రతలు, పూర్తి స్థాయిలో  పోలీస్ బందోబస్తును, భారీ కేడింగ్  పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను, అగ్నిమాపక పరికరాలను , సేవలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖను, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖను,  రోడ్ల మరమ్మత్తుల పనులను అర్.అండ్.బి ,  అధికారులు , శానిటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని, మున్సిపాలిటీ, జిల్లా పంచాయితీ శాఖ, ఈ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు.

 జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలన్నారు. వేద పాఠశాల  వద్ద శంకుస్థాపన కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం బక్రీద్ ఏర్పాట్లపై, ధాన్యం కొనుగోలు, ప్రత్యేక సమగ్ర సవరణ, సెన్సెస్, పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులతో  సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28న పవిత్ర బక్రీద్ పండగ ఉన్నందున ఈద్గా ల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. బక్రీద్ పండగ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సమస్యలు లేకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయతో విధులు నిర్వహించాలని అన్నారు. మసీదుల వద్ద పటిష్టమైన పారిశుద్ధ్యం , మంచినీరు కరెంటు, వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బక్రీద్ పండగ రోజున మసీదుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు రవాణాలో మరింత వేగం పెంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. సరిపడా హమాలీలను పెట్టుకుని కొనుగోలైన ధాన్యం త్వరగా లోడింగ్ చేసి మిల్లులకు తరలించాలన్నారు.

ప్రత్యేక సమగ్ర సవరణ  మ్యాపింగ్ ప్రక్రియలో బిఎల్ఓ ల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు మండల తాసిల్దార్లను ఆదేశించారు. ఖచ్చితమైన ధ్రువీకరణ సరైన డేటా నమోదులో పారదర్శకతతో పనిచేయాలన్నారు. 

జన గణన -2027 మొదటి విడతలో భాగంగా ఇంటింటి సర్వే సక్రమంగా పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు .ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి, నమోదు చేయాలని ఆదేశించారు.అందరి వివరా లు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో  జెడ్పీ సీఈఓ శోభారాణి, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి,డిఆర్డిఏ నాగిరెడ్డి, పోలీస్ అధికారులు, తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ,సంబంధిత శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -