జొన్న పంట కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో డోంగ్లి ,మద్నూర్ ,మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
నవతెలంగాణ-మద్నూర్
రైతు శ్రేయస్సే ప్రజా పాలన ప్రభుత్వ ధ్యేయమని జొన్న పంట కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయ్, మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం రైతు శ్రేయస్సును కోసం జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే రైతు శ్రేయస్సు గురించి తపించే వారని, ఆయన ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.
జొన్న పంటకు మద్దతు ధర క్వింటాలుకు రూ.3699 ప్రకటించడం జరిగిందని, రైతులు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం పరుచుకోవాలని ఇరు మండలాల పార్టీ నాయకులు చెప్పారు. కార్యక్రమంలో డోంగ్లి మండల సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మండల సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, డోంగ్లి మండల ప్రత్యేక అధికారి రమ్య, డోంగ్లి మండల తాసిల్దార్ రంజిత్ కుమార్, ఏవో శివకుమార్, డోంగ్లి మండల సింగిల్ విండో కార్యదర్శి బాబురావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్, ఆ మండల సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంత్ యాదవ్, ఉపాధ్యక్షులు అభిషేక్ పటేల్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండ గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ పటేల్, మద్నూర్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బండి గోపి, చిన్నతడుగూరు, పెద్ద తడగూర్, తడి ఇప్పర్గా, మద్నూర్, మెనూర్, పెద్ద ఎక్లారా, అంతాపూర్, మద్నూర్ సింగల్ విండో డైరెక్టర్లు ఆయా మండలాల జొన్న పంట రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.



