Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని భువనగిరి మండల విద్యాధికారి పి.నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో,  సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి పెన్షనర్స్ భవవనంలో ప్రారంభించి ఆయన మాట్లాడారు. 

 ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న లక్షల రూపాయల విలువ చేసే ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ పెసరు లింగారెడ్డి కోరారు.జిల్లాలోని 17 మండలాల నుండి 148 మంది దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు.చౌటుప్పల్,భువనగిరి,గుండాల మండలంలోని ముగ్గురు విద్యార్థులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ తో పాటు వీల్ చైర్స్,సి. పి.చైర్స్,రోలేటర్లు,వినికిడి యంత్రాలు, టి.ఎల్.ఎం. కిట్లు మొదలైనవి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోత్కూరు మండల విద్యాధికారి టి.సత్యనారాయణ,రిసోర్స్ పర్సన్లు కిరణ్, రామచంద్రు, రవీందర్ రెడ్డి,సుధామణి, సంధ్యారాణి,సుజాత,ఆలింకో ప్రతినిధులు సోనీ కుమారి,శోభిత్ ద్వివేది, సుమీత్ రాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -