– డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్: అనునిత్యం పేద ప్రజల సమస్యల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సిపిఎం పార్టీ అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని గెలిపించాలని మంగళవారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రజా గొంతుక దోనూరి నర్సిరెడ్డి అన్నారు. శ్రమజీవుల పేదల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు.ఎన్నికలను పూర్తిగా మార్చేసి రాజకీయాలను బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బ్రష్ పట్టించారని అన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులైనా కమ్యూనిస్టుల గడ్డ రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను బుద్ధి చెప్తారని అన్నారు. మునుగోడు కమ్యూనిస్టుల అడ్డా అని నిరూపించడానికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి సిపిఎం పార్టీ అభ్యర్థి నర్సిరెడ్డి గెలిపించాలని అన్నారు. మతోన్మాద బీజేపీ అవకాశవాద బీఆర్ఎస్ అవినీతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి నిత్యం ప్రజల మధ్య ఉండే సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆనగంటి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీర్క సంజీవరెడ్డి, అంతటి అశోక్, బోయ యాదయ్య,చీర్క అలివేలు, బోయ బాలనరసింహ, రొడ్డ యాదమ్మ,బోయ మధు, బర్రె రాజు పెరియార్, సిద్ధగోని శ్రీకాంత్, రొడ్డ భగత్ సింగ్,శివకుమార్,మీసాల లింగయ్య,రొడ్డ శ్రీకాంత్, బోయ సాయికిరణ్, బోయ చింటు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు