Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులు త్వరగా ముగించుకొని వెళ్లాలి: జడ్పీ సీఈవో

ఉపాధి హామీ పనులు త్వరగా ముగించుకొని వెళ్లాలి: జడ్పీ సీఈవో

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ : వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు త్వరగా ముగించుకొని వెళ్లాలని జడ్పీ సీఈవో చందర్ నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీల సంఖ్య పెంచి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల ప్రాంతంలో త్రాగునీరు, షెడ్డు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందజేయాలన్నారు.

గ్రామపంచాయతీ రికార్డు పరిశీలన.. పెద్ద మల్లారెడ్డి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై వార్డు సభ్యులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్పీ సీఈవో చందర్ నాయక్ రికార్డులు పరిశీలించారు. రికార్డుల తనిఖీ అనంతరం పూర్తి నివేదిక జిల్లా కలెక్టర్ అందజేయడం జరుగుతుందన్నారు. నిధులు దుర్వినియోగం జరిగితే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, సర్పంచ్ సాయ గౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -