- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మాజీ ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్ పెద్ద కుమారుడు బాధవత్ విశాల్ నాయక్ దినకర్మ కార్యక్రమం గురువారం మండలంలోని ఓపెన్ తలలో రూప్లా నాయక్ తండాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ధర్పల్లి మాజీ జెడ్పిటిసి, బిఅర్ఎస్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ మోహన్, మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



