నవతెలంగాణ – రాయపోల్
తెలంగాణ బీజేపీ మాజీ సర్వీస్మెన్ సెల్ సిద్దిపేట జిల్లా కన్వీనర్‌గా నియమితులైన రిటైర్డ్ ఆర్మీ జవాన్ నాయక్ నీల చంద్రంను బీజేపీ రాయపోల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మంకిడి స్వామి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో రిటైర్డ్ ఆర్మీ నీల చంద్రంకు సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంకిడి స్వామి మాట్లాడుతూ.. దేశ సేవలో విశిష్ట సేవలందించిన నీల చంద్రంకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.మాజీ సైనికుల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి నీల చంద్రం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మాజీ సైనికుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. నీలా చంద్రం కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నీల స్వామి, గజ్వేల్ రామచంద్రం, నర్సింలు, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మాజీ సర్వీస్మెన్ సెల్ జిల్లా కన్వీనర్‌గా నీల చంద్రంకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



