Thursday, July 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్ 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నాన్ని నిరసిస్తూ రాయపోల్ మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు.దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు రోడ్డు పై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు మంకిడి స్వామి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. దేశ ప్రజలు ఇటువంటి రాజకీయాలను గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు అని 15 సంవత్సరాలుగా అధికారానికి దూరమయ్యారని రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి రానివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, నాయకులు గజ్వేల్ రామచంద్రం, నీల స్వామి, నీల చంద్రం, టెంకంపేట నర్సింలు, రాజు గౌడ్, తూర్పు లక్ష్మణ్, కొంగరి స్వామి, సంతోష్ రెడ్డి, షాదుల్, కరుణాకర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -