నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఇటీవలె హైదరాబాద్ నగరంలో స్కూలు విద్యార్థులకు ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా బిర్లా ప్లానిటోరియం వారు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో తార్నాక బచ్పన్ ప్లే స్కూల్ విద్యార్థులు సత్తా చాటుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 23 మంది విద్యార్థులు పాల్గొనగా ఆరుగురు విద్యార్థులు బహుమతులు కైవసం చేసుకున్నారు. వీరిలో 4వ,తరగతి కి చెందిన ఆదిత్య ఫస్ట్ ప్రైజ్ , శివాన్ శ్రయాన్సీ 2వ,బహుమతి, హన్సిత్ రెడ్డి 3వ,బహుమతి, తో పాటుగా ఉద్విత, ఆధ్యా , మాధవ్ లు బహుమతులు డ్రాయింగ్ లో ఉత్తమ ప్రదర్శన కనపరిచి బహుమతులు పొందారు.వీరికి మెడల్స్ తో పాటుగా సర్టిఫికేట్స్ ను నిర్వాహకులు అందజేశారు. వీరిని తార్నాక బచ్పన్ ప్లే స్కూల్ డైరెక్టర్ ఎం వి ఎస్ డి. ప్రసాద్, ఎం ఎస్ సింధు, ప్రిన్సిపాల్ జున్ స్టీవెన్ సన్ లు శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం వి ఎస్ డి. ప్రసాద్, ఎం ఎస్.సింధు, మాట్లాడుతూ. ప్లే స్కూల్లో విద్యార్థులకు విద్య తో పాటుగా వివిధ రకాల అంశాలపై రాణించేలా వారిని ప్రోత్సహిస్తూ, వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీస్తామని వారిది మా వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయలతో పాటుగా క్రీడలు ముఖ్యం అన్నారు.
డ్రాయింగ్ పోటీల్లో రాణించిన బచ్ పన్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


