Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడదెబ్బకు గురై ఉపాధి కూలి మృతి...

వడదెబ్బకు గురై ఉపాధి కూలి మృతి…

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు:  ఉపాధి కూలికి వెళ్లి వడదెబ్బకు గురై ఉపాధి కులి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని చీకటి మామిడి గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చీకటి మామిడి గ్రామానికి చెందిన జీడిమడ్ల రాములు(70) రోజు వారీగా ఉపాధి కూలికి వెళ్లి వచ్చిన మాదిరిగానే బుధవారం కూడా ఉపాధి కూలికి వెళ్లి వచ్చిన అనంతరం వడదెబ్బకు గురై మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు , మాజీ సర్పంచ్ తాటికొండ సంతోష సైదులు గ్రామ సర్పంచ్ జీడిమడ్ల సైదులు తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాములు మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు . అనంతరం 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఒగ్గు శేఖర్ , పి విజయ్ , బోయపల్లి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఇంద్రారెడ్డి , రడం వెంకన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -