Friday, May 22, 2026
E-PAPER
Homeసినిమాస్ట్రాంగ్ కంటెంట్‌తో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’

స్ట్రాంగ్ కంటెంట్‌తో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’

- Advertisement -

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ,‘మా నాన్న చనిపోయిన తరువాత నేను నటిస్తున్న, నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే కమల్ చెప్పాడు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పాడు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. హై క్వాలిటీ స్టాండర్డ్‌లో ఉంటుంది. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. జూన్ 19న స్ట్రాంగ్ కంటెంట్‌తో మా సినిమా ఆడియెన్స్ ముందుకు వస్తోంది. మా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. ‘ఈ సినిమాలో నాకు లక్ష్మీ అనే మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్అని హీరోయిన్ రాశీ సింగ్ చెప్పారు. దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ, ' ‘నా డెబ్యూ మూవీ ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. పూరి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్ కోసం చూశాను. వడ్డే నవీన్ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టుగా ఆయన రీ ఎంట్రీ, కమ్ బ్యాక్ ఉంటుంది. వడ్డే నవీన్ లాంటి ఓ మంచి వ్యక్తితో నేను మొదటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అని తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, ‘మంచి కమర్షియల్ సినిమాకి మ్యూజిక్ చేయాలని అనుకుంటున్న టైంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ వండర్స్ చేస్తుంది.పాటలను అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. ‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్అని ఎడిటర్ విజయ్ ముక్తవరపు చెప్పారు. కెమెరామెన్ కార్తీక్ సుజాత సాయికుమార్ మాట్లాడుతూ,'‘వడ్డే నవీన్ కి ఇది కమ్ బ్యాక్. మేం పది నెలలుగా కష్టపడి ఈ మూవీని తీశాం. దీన్ని జనాల వరకు మీడియానే తీసుకు వెళ్లాలి’ అని అన్నారు. ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నం దుకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అని ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -