Thursday, May 21, 2026
E-PAPER
Homeసినిమాఇప్పటివరకు చూడలేదు

ఇప్పటివరకు చూడలేదు

- Advertisement -

దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మైథలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. నార్త్ ఇండియాలో అన్ని భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. హిందీ మార్కెట్‌లో భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ భాగస్వామ్యం ఈ సినిమాని దేశవ్యాప్తంగా మరింత చేరువ చేయనుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది అని మేకర్స్ అన్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, రిషబ్ సావ్నే నటిస్తున్న ఈ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ జూలై 3న విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -