ఐదు సమస్యల పరిష్కారం
సీఎంతో భేటీ తర్వాత తొలిసారి
మళ్లీ సమావేశం కావాలని నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై గురువారం ముందడుగు పడింది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత తొలిసారిగా హైదరాబాద్ బస్‌భవన్‌లో 13 కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు(ఈడీ)లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అన్నీ సంఘాలు అంగీకరించిన కామన్ డిమాండ్లను తొలుత చర్చించారు. ఈ సమస్యలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో ఉన్నవి కావడంతో ఇరుపక్షాలు చర్చించాయి. కాగా మరోసారి సమావేశం కావాలని సంఘాల నేతలు, ఈడీలు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు చోటుచేసు కున్నాయి. ఆర్టీసీ నుంచి ఈడీలు వెంకన్న, కుచ్‌రోసాఖాన్, రాజశేఖర్, సాల్మన్, పుష్ప, ఉషాదేవి పాల్గొనగా, సంఘాల నుంచి ఈదరు వెంకన్న, బాల్‌రెడ్డి, వీరాంజేయులు, విఎస్ రావు, అశ్వద్ధామరెడ్డి, శంకర్, థామస్‌రెడ్డి, కమలాకర్ తదితరులు హాజరయ్యారు. మొత్తం సమ్మె కాలంలో సుమారు 32 డిమాండ్లను సర్కారు ముందు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉంచగా, పీఆర్సీ, విలీనం, మరో అంశాన్ని పరిష్కరించేందుకు సర్కారు అంగీకరించింది. అందుకు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాయి. మిగిలిన సమస్యల విషయంలో ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలతో కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు భేటీ అయ్యారు. ఆర్టీసీ పరిష్కరించాల్సి సమస్యల్లో ఐదు సమస్యల పరిష్కారానకి ఈడీల కమిటీ అంగీకరించింది.
అంగీకారం కుదిరిన సమస్యలు
బ్రెడ్ విన్నర్ స్కీంలో ఉన్న వారందరినీ రెగులర్ చేస్తారు. ఇప్పటికే రెగ్యులర్ ఐన వారి సీనియారిటీని గుర్తిస్తారు. భవిష్యత్లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయం పై నిర్ణయం చేయలేదు. అన్ని అలవెన్సులు 80 శాతం పెంచుతారు. అన్ని ఖాళీలు భర్తీ చేస్తారు. క్లరికల్ టెస్ట్ పాసైన వారికి వెంటనే ఆ పోస్టులు ఇస్తారు. ఆర్‌పీఎస్ 2017 ఏరియర్ల చెల్లింపుపై నిర్ణయం వాయిదా పడింది. 2013, 2017 వేతన సవరణల పీఎఫ్ ను ఈపీఎఫ్ చెల్లింపు మీద చర్చ జరిగింది. తుది నిర్ణయం చేయలేదు. మిగిలిన అన్ని అంశాలపై చర్చలు వాయిదా పడ్డాయి. తర్వాత జరిగే మరో సంయుక్త సమావేశంలో చర్చిస్తారు.
కామన్ డిమాండ్లపై 13 కార్మిక సంఘాలతో ఆర్టీసీ ఈడీల చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


