Friday, May 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుల్లాతాండలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

గుల్లాతాండలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని గుల్లా తాండలో గ్రామ సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ తో కలిసి ఎంపిడివో శ్రీనివాస్ శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకం పనులను గోవింద్ నాయక్ తాండా, పెద్ద గుల్లా తాండా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలు ఉదయం ఏడు గంటల లోపు పని ప్రదేశంలో ఉండాలని అన్నారు. ఎండలు పెరిగినందువలన ప్రతి ఒక్కరు భద్రత పాటించాలని సూచించారు. పనులు సక్రమంగా నిర్వహించాలని లోటుపాట్లు లేకుండా కొలతల ప్రకారం పనులు చేసినప్పుడే పూర్తిస్థాయిలో కూలీ డబ్బులు వస్తాయని అన్నారు. పని జరుగుతున్న ప్రదేశంలో కూలీలకు కచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీరు, నీడ కల్పించాలని ఎఫ్ఏను ఆదేశించారు. అందుబాటులో ఉంచాలని తెలిపారు. అంతకుముందు హాజరు పట్టికను పరిశీలించి ప్రతి ఒక్కరికి కూలి పనులకు వచ్చిన వారికి హాజరు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి నాగయ్య, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు యష్ల్పాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -