నవతెలంగాణ-ఆర్మూర్: ఇటీవల రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు జిల్లా గౌడ సంఘం,జిల్లా గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు దేగం యాదగౌడ్,ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు రామ గౌడ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు లింగా గౌడ్ హాజరైనారు.
ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మండలాల వారిగా గౌడన్నలను ఏకం చేస్తూ, బలోపేతం దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి నియమించినప్పటికీ, కల్లుగీత కార్మికులకు, గౌడ్ అన్నలకు న్యాయం చేసేలా నిధులు సమకూర్చాలన్నారు.కల్లు గీత కార్మికులకు పెన్షన్ సదుపాయం,ప్రమాద బీమాను పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జిల్లా గౌడ సంఘం, మండలాల గౌడ యువజన సంఘం సన్మానించిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ యువజన కార్యవర్గం, వివిధ మండలాల యువజన కార్యవర్గం, గౌడ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



