నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ చౌటుప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ నేత పబ్బు రాజు గౌడ్‌లపై సోషల్ మీడియాలో నిరాధార,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీఆర్‌ఎస్ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ ఫైర్ బ్రాండ్,మునుగోడు అభివృద్ధి ప్రదాత,అవినీతి మచ్చలేని నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రజలు నమ్ముతారు.ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.కష్టపడి కారు కొంటే కూడా ఓర్వలేకపోతున్న మీ కుటిల బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు అని వారు విమర్శించారు.
పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని,మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి మేము కష్టపడి సంపాదించినా మీకు అలానే అనిపిస్తుంది అని ఎద్దేవా చేశారు.మేము నిక్కసైన,నిజాయతీ గల నాయకుడు రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నాం.మా పార్టీలో,మునుగోడు నియోజకవర్గంలో అవినీతికి తావు లేదు. ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రండి అని బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు.ఇకపై పెయిడ్ చానెల్స్, పెయిడ్ అకౌంట్స్, పింక్ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు,వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



