Friday, May 22, 2026
E-PAPER
Homeనిజామాబాద్మద్నూర్ మండల సమాఖ్య ప్రతినిధులకు శిక్షణ

మద్నూర్ మండల సమాఖ్య ప్రతినిధులకు శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలోని మండల మహిళా సమాఖ్య (ఐకేపీ) కార్యాలయంలో గ్రామ సంఘం అధ్యక్షులకు సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సిఆర్‌పిలు) శ్రుతి , శారద, రెండు రోజులు శిక్ష‌ణ ఇచ్చారు. మొదటిరోజు శిక్షణలో మండల సమాఖ్య శాసనాత్మక బాధ్యతలు, ఉప కమిటీల పనితీరు, సర్వ సభ్య సమావేశం, సామాజిక సమీకరణ, ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం, బ్యాంక్ లోన్ రుణ మేలా అవగాహ‌న క‌ల్పించారు.

రెండవ రోజు శిక్షణలో మండల సమాఖ్య సమావేశం నిర్వహించి మీటింగ్ లో చర్చించవలసిన అంశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో చేపట్టే కార్యక్రమాలను గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో…. మద్నూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, మండల సమాఖ్య ఏపియం జగదీష్ కుమార్, సీసీ లు.. అకౌంటెంట్ నర్సింగ్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -