నవతెలంగాణ-మద్నూర్: మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో శుక్రవారం మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి సైబర్ నేరాలపై బ్యాంకు కస్టమర్లకు అవగాహన కల్పించారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఓటిపి నంబర్ ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలతో పాటు పాలు రకాలు జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.
హెల్మెట్ ఉపయోగంపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని పేర్కొన్నారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాదక ద్రవ్యాల నిర్ములన, కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం మద్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్ మంచ తిరుపత, శేషరావు పిసిలు, ప్రభాకర్ సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం ప్రజలకు ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ షి టీమ్ అనిల్, పార్వతి బ్లూ కోట్స్ పిసిఎస్ ఓంకార్, పరుశురాం హేమాద్రి, బ్యాంక్ మేనేజర్ నవీన్, బ్యాంక్ సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బ్యాంక్ కస్టమర్స్ పాల్గొన్నారు.



