నవతెలంగాణ-పెద్దవంగర: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన ఘటన పెద్దవంగర శివారు గంట్లకుంట ఎక్స్ రోడ్డు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవంగర గ్రామానికి చెందిన చిలుక సైదులు, ఆయన భార్య యాకలక్ష్మి ఒక బైక్ పై, కుందూరు పరుశురాం తన భార్య వెంకటమ్మ తో కలిసి మరో బైక్ పై సుతారీ పనుల నిమిత్తం తిరుమలగిరి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో తొర్రూరు వైపు వస్తున్న బొలెరో గూడ్స్ వాహనం రెండు బైక్ లను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరుశురాం, వెంకటమ్మ కు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. పైలట్ నవీన్, ఈఎంటీ రఘు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



