కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నవతెలంగాణ–పరకాల
పరకాల పట్టణంలోని పలు సర్వే నంబర్లలో సుమారు 50 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైనట్లు వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.పరకాల పట్టణంలోని సర్వే నంబర్లు 682, 683, 698, 195, 637, 640, 648, 750, 751, 752, 746, 749, 779లలో భూముల అక్రమ ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. నకిలీ లేదా కల్పిత పత్రాలను ఉపయోగించి భూముల ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నందున సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని తెలిపారు.విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు.
భూముల ఆక్రమణపై సమగ్ర విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



