Wednesday, August 12, 2026
E-PAPER
Homeఖమ్మంకేవీ రమణ అంకితభావం యువ కార్మికులకు ఆదర్శం

కేవీ రమణ అంకితభావం యువ కార్మికులకు ఆదర్శం

- Advertisement -

– రమణ సన్మాన సభలో ఏఐటీయూసీ నాయకులు
నవతెలంగాణ – సత్తుపల్లి

జేవిఆర్-ఓసీలో ఈపీ ఆపరేటర్‌గా 36 ఏళ్ల సుదీర్ఘ సేవలు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన కేవీ రమణను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ..సత్తుపల్లి జేవీఆర్-ఓసీలో ఈపీ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేవీ రమణ తన 36 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారని కొనియాడారు. ​అధికారులు, తోటి కార్మికుల మన్ననలు పొందారని వారన్నారు. క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వర్తించి పై అధికారులు సూపర్వైజర్ల నుంచి  మన్ననలు పొందారని ప్రశంసించారు. తోటి కార్మికులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, క్రమశిక్షణతో పని చేస్తూ యువ కార్మికులకు మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దారా భీమయ్య, సూర్యప్రకాశరావు, జీ నరసింహారావు, బీ సుధాకర్, భాస్కర్ లాల్, మోతీలాల్, నరేందర్, అశోక్, శ్రీకాంత్, శ్రీను, అఫ్జల్, రాంబాబు, ప్రేమ్ కుమార్, తిరుపతి, సాహిద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -