Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

తహసీల్దార్ వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కారం చేయాలని జిల్లా యుఎస్ పిసి  కమిటీ సభ్యులు సుదర్శనం ఆధ్వర్యంలో బుధవారం మండల తహశీల్దార్ రవికుమార్ కు ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తక్షణమే పిఆర్సి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఎ లను విడుదల చేయాలని, ఈనెల 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని కోరారు.

జీవో 25 సవరణ చేసి అమలు చేయాలని, సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఈఓ, డిప్యూటీ డి ఓ, డిఈఓ పోస్టులను పదోన్నతులు ద్వారా నియమించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత  పెన్షన్ల్ వర్తింపజేయాలని, కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, టెట్టులో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని స్పెషల్ టెట్ను సబ్జెక్టు వారి పేపర్లతో నిర్వహించాలని, మోడల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటిని క్లియర్ చేయాలని, హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలు చర్యలు తీసుకోవాలని మొదలైన డిమాండ్లను వెంటనే పరిస్కారం చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -