మండలంలో 28.78000 లక్షల చేప పిల్లలు పంపిణీకి సిద్ధం
మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి
నవతెలంగాణ – మల్హర్ రావు
మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెరువుల్లోకి ఉచితంగా చేప పిల్లలను వదిలేం దుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈసారి జూలై నెల చివరి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీళ్లు నిండకపోవడంతో టెండర్ల ప్రక్రియ కొంత ఆలస్యం అయినట్టుగా అధికా రులు అంటున్నారు.ఆగస్టులో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లోకి, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు.
ఈ నెల 17 వరకు గడువు
ఈ నెల 6న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ ఈ నెల 17 వరకు గడువు ఉందని మత్స్య శాఖ అధికారులు తెలిపారు.ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సమక్షంలో టెండర్లు తెరవనున్నారు. టెండర్లలో రెండు షెడ్యూళ్లకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి తక్కువ ధర కోట్ చేసిన వారికే చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. టెండర్ వచ్చిన గుత్తేదారుల చేప పిల్లల పెంపకం కేంద్రాలను తనిఖీ చేసి అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొ న్నారు.వచ్చే నెల మొదటి వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సెప్టెంబర్ చివరి వరకు చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
మండలంలో ఇలా…
మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీల పరిధిలో ఆన్సాన్ పల్లి,నాచారం,పెద్దతూoడ్ల,కొండంపేట,తాడిచెర్ల గ్రామాల పరిధిలోని సంఘాల్లో 780 మంది సబ్యులు ఉన్నారు.అయితే మండలంలోని 45 చెరువుల్లో చేప పిల్లలను వేసేందుకు మత్స్య శాఖ అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందు కోసం 22,78000 లక్షల చేప పిల్లలు వదిలేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. 35 ఎం.ఎం.నుంచి 40 ఎం.ఎం. పరిమాణం గల చేప పిల్లలను వదల నున్నట్లు అధికారులు తెలిపారు.దీంతో మండలంలోని మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.



