నవతెలంగాణ-నిజాంసాగర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరస్తా వద్ద గల జాతీయ రహదారి 161 పై బుధవారం భారీ రాస్తారోకో, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అకారణంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై పోలీసులు చర్యలకు దిగడం సరికాదని అన్నారు. నీట్ పేపర్ లీక్ ఆయు దేశవ్యాప్తంగా విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన పరీక్షల నిర్వహణలో లోపాలు, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పి, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



