నవతెలంగాణ-బజార్ హత్నూర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో నూతన మెడికల్ ఆఫీసర్‌గా డా. నవీన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మెడికల్ ఆఫీసర్ డా. నవీన్ రెడ్డిని స్థానిక సర్పంచ్ పరచ సాయన్నతో పాటు గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజలు, వైద్య సిబ్బంది డా. నవీన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సేవలతో బజార్ హత్నూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డుబ్బుల చంద్రశేఖర్, కొంగర్ల రాజన్న, హెచ్ఈవో సూర్య ప్రకాష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్‌గా డా. నవీన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



