Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దఏడ్గిలో ఉచిత వైద్య శిబిరం

పెద్దఏడ్గిలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
పెద్ద ఎడ్గి గ్రామంలో మంగళవారం మండల వైద్యారోగ్యా శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా వైద్య సిబ్బంది గ్రామస్తులకు అవసరమైన వైద్య సేవలతో పాటు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అస్పత్వర్ అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, ఎమ్ఎల్ పీహెచ్( MLHP) మానిలా, సూపర్వైజర్ విఠాబాయి, (ANM ) ఏఎన్ఎం కె. సవిత్రి, ఆశా కార్యకర్తలు భారత్, సునీత పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. అనంతరం వైద్య సిబ్బంది మాట్లాడుతూ..”ఆరోగ్యవంతమైన గ్రామం – అభివృద్ధి చెందిన గ్రామ” మన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -