నవతెలంగాణ – పరకాల
ఇటీవల మరణించిన పలువురు మృతుల కుటుంబ సభ్యులను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డులకు చెందిన గూడెల్లి మల్లమ్మ, మంద ఈశ్వరమ్మ ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, బాధిత కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.



