Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రాకతో ముందస్తు అరెస్టులు

సీఎం రాకతో ముందస్తు అరెస్టులు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా, శుక్రవారం రాత్రి అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తుగా ఆలేరు పోలీసులు అఖిల పక్ష కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, శనివారం ఉదయం 10 గంటలకు వదిలివేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు మాట్లాడుతూ..అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, మంత్రుల పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్ల ఐలయ్య,ఎ  రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒకలపక్ష కమిటీ సభ్యులు పసుపు నూరి వీరేశం, ఆర్ జనార్ధన్, మొరిగాడి చంద్రశేఖర్, పుట్ట మల్లేశం, చెక్క వెంకటేష్, కళ్ళేపు అడవయ్య  నంద గంగేష్, జూకంటి పౌల్, ఆడేపు బాలస్వామి, పద్మ సుదర్శన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -