ఎన్టీఏను రద్దుచేయాలి.. బాధ్యతను నిర్ణయించాలి..
సీపీఐ(ఎం) డిమాండ్
పరీక్షల నిర్వహణలో సమస్యలు.. సంస్థాగత జవాబుదారీతనం లేదు
విమానప్రయాణికుల
భద్రతను కాపాడాలి : ప్రధానికి సీపీఐ(ఎం)
ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ లేఖ
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఇఎస్‌ఎల్) కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రయాణికుల భద్రతను కాపాడాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ శనివారం లేఖ రాశారు. కార్మికుల నిరంతర సమ్మె, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఎనిమిది రోజులుగా ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్‌కతా, నాగ్‌పూర్‌లోని ఎఐఇఎస్‌ఎల్ ఎంఆర్‌ఒ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) కేంద్రాల వద్ద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఎఐఇఎస్‌ఎల్, పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దేశీయ, అంతర్జాతీయ విమానాలకు అవసరమైన నిర్వహణ సేవలను అందిస్తుంది. వేలాది మంది ప్రయాణికులు ఈ కార్మికుల నైపుణ్యంపై ఆధారపడి సురక్షితమైన విమాన ప్రయాణాలు చేస్తున్నారు.
ప్రధాన సమస్యలు, డిమాండ్లు
వేతన అసమానతలు : 2026 మే 8న భారత ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ క్లాజ్ 7 ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులకు శాశ్వత కార్మికులతో సమానమైన వేతనాలు, అలవెన్సులు, ప్రయోజనాలు లభించాలి. అయితే, ఎఇఇఎస్‌ఎల్ ఇంజినీర్లు, సహాయకులు, ఫిక్స్‌డ్ టర్మ్ కింద నియమించబడినప్పటికీ, వారి శాశ్వత సహోద్యోగుల జీతంలో మూడింట ఒక వంతు కంటే తక్కువ వేతనం పొందుతున్నారు.
అధిక పని గంటలు, తక్కువ ఓవర్‌టైమ్ : విమానాల భద్రతను పర్యవేక్షించే ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు రోజుకు 12 నుండి 14 గంటలు పని చేయాల్సి వస్తుంది. వారికి గంటకు కేవలం రూ.85 ఓవర్‌టైమ్ చెల్లిస్తున్నారు. ఇది ఇటీవల నోటిఫై చేయబడిన కార్మిక కోడ్ నిబంధనలకు విరుద్ధం. దీని ప్రకారం ఓవర్‌టైమ్ పనికి సాధారణ వేతన రేటుకు రెట్టింపు చెల్లించాలి.
బెదిరింపులు, తొలగింపులు : కార్మికుల చట్టబద్ధమైన డిమాండ్లను (సమాన పనికి సమాన వేతనం, క్రమబద్ధీకరణ, మంచి పని పరిస్థితులు, సరసమైన ఓవర్‌టైమ్ పరిహారం) పరిష్కరించడానికి బదులుగా, యాజమాన్యం బెదిరింపులు, ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. సమస్యలను చర్చించడానికి వెళ్ళిన నలుగురు యూనియన్ ప్రతినిధులను యాజమాన్యం తొలగించింది. ఈ ప్రతీకార తొలగింపులకు వ్యతిరేకంగా, తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారు.
పౌర విమానయాన భద్రతపై ఆందోళనలు
తాజాగా, బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (ఎఐ 2802) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయనే అనుమానంతో ఐజిఐ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియా, అనేక ఇతర విమానయాన సంస్థలు తమ కార్యకలాపాల కోసం ఎఐఇఎస్‌ఎల్ ఎంఆర్‌ఒ సౌకర్యాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ విమాన భద్రత సమస్యను ఎంపి జాన్ బ్రిట్టాస్ పౌర విమానయాన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నాగ్‌పూర్‌లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) కూడా ప్రస్తుత పారిశ్రామిక వివాదంపై ఎఐఇఎస్‌ఎల్ యాజమాన్యం ఆదేశాలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కార్మికుల ప్రతినిధుల తొలగింపు విభేదాలను మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమస్యలో తక్షణమే జోక్యం చేసుకోవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను, విమాన ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని ఎంఎ బేబీ.. ప్రధాన మంత్రిని లేఖలో కోరారు.
నీట్ లీకేజీపై చర్యలేవి?
- Advertisement -
- Advertisement -



