Sunday, May 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనా బొగ్గు గనిలో భారీ పేలుడు

చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు

- Advertisement -

90 మంది మృతి
ప్రమాద సమయంలో 
గని లోపల మొత్తం 
247 మంది కార్మికులు


బీజింగ్ : చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో సుమారు 90 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. పలువురు ఇంకా భూగర్భంలో చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల కాలంలో చైనాలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదొకటిగా ప్రభుత్వ మీడియా పేర్కొంది. షాన్సీ ప్రావిన్స్‌లోని టోంగౌజ్ గ్రూప్‌కు చెందిన లియుషెన్యు బొగ్గు గనిలో శుక్రవారం(మే 22వ తేదీ) రాత్రి 7:29 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నట్టు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు, అక్కడ చిక్కుకున్న చాలా మందిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ 82 మంది మృతిచెందినట్లు అధికారులు ధ్రు వీకరించారు.

గల్లంతైన వారి కోసం గాలింపు
ఇదిలా ఉండగా మరో తొమ్మిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని అన్నారు. సంఘటనా స్థలంలో భారీ సంఖ్యలో అంబులెన్స్‌లు, రెస్క్యూ సిబ్బంది మోహరించాయి. ప్రభుత్వ ప్రసార సంస్థ, సీసీటీవీ విడుదల చేసిన వీడియోల్లో హెల్మెట్లు ధరించిన సహాయక సిబ్బంది స్ట్రెచర్‌లపై గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. గాయపడిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశాలు
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పంధించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. “అన్ని ప్రాంతాలు, విభాగాలు ఈ ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పని ప్రదేశ భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి భారీ ప్రమాదాలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.

కార్బన్ మోనాక్సైడ్ లీక్
ప్రాథమిక దర్యాప్తులో గనిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు స్థాయులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ వాయువు అత్యంత విషపూరితమైనది అలాగే ఎటువంటి వాసన లేనిదిగా పరిగణిస్తారు. పేలుడుకు కారణమైన కంపెనీకి బాధ్యత వహిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -