Sunday, May 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు

సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు

- Advertisement -

నెలకు రూ.26 వేలుగా సవరించాలి: కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించిన కనీస వేతనాల్లో ఎలాంటి శాస్త్రీయత లేదని సీఐటియూ రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్కరాములు, ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌ ‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అన్నీ కార్మక యూనియన్ల సమావేశం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవానికి కార్మికుల వేతనాలు తగ్గాయని గుర్తు చేశారు. కార్మికుల వేతనాలను మూడు జోన్ల వారిగా నిర్ణయించడం. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా శ్రమను దోచుకోవటమే అవుతుందని అభిప్రాయపడ్డారు. 2021 లో ప్రకటించిన ఐదు జీవోల ప్రకారం రూ. 18 వేలుగా కనీస వేతనం, వీడీఏ ఒకొక్క పాయింట్కు రూ. 12 ప్రకారం కనీస వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ. 26 వేలను కనీస వేతనంగా నిర్ణయించాలని అన్నీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.ఐఎన్‌‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలలో సవరణలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ విడిఏపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలోగానీ, కనీస వేతనాలు పెంచడంలోగాని దృష్టిపెట్టకుండా యాజమాన్యాల లాభాల కోసమే పనిచేస్తున్నదన్నారు. ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచలేదన్నారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సూర్యం, పద్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి కార్మికుల కనీస వేతనాలు నిర్ణయం చేయడం సరైంది కాదన్నారు. జోన్ల వారిగా వేతనాలను నిర్ణయిస్తే తీవ్రంగా నష్టపోతారన్నారు. ఐఎఫ్‌‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ నాన్ షెడ్యుల్డ్‌ ఎంప్లాయీస్ వేతనాలు నిర్ణయించకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐయూబీయూసీ రాష్ట్ర ఇన్చార్జీ భరత్ బీఆర్డీయూ రాష్ట్ర నాయకులు ధానకర్ణచారి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లీఖార్జున్, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, కూరపాటి రమేష్, పి.శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, రాష్ట్ర నాయకులు రొయ్యల రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -