గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో ముఖ్యమంత్రివి అసత్య ఆరోపణలు :
రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో తనపై చేసిన అసత్య ఆరోపణలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సీఎంకు ఆయన లీగల్ నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా సీఎం తనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదా యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు. అది తన బినామీ కంపెనీ అని, దానికి తాను సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానంటూ రేవంత్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. సీఎం రాజకీయ లబ్ది కోసం తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
పరువు నష్టం దావా వేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



