Tuesday, June 16, 2026
E-PAPER
Homeకవితఎందుకైనా మంచిది

ఎందుకైనా మంచిది

- Advertisement -

కొత్త చెప్పుల్లా
కొత్త చుట్టాలతో…
పెద్ద పెద్ద అంగలతో
పొడవైన మాటలతో
వాళ్ల ఇళ్ల చుట్టూ
రోజూ హుషారే.
కాళ్ళసలు కాలవని
మెత్తగా, ఎత్తుగా ఉంటాననే
వడివడి నడకను చూసి
నులక మంచంలో
తాత బోసినవ్వు హెచ్చరిక
”కొత్త చెప్పులు కరుస్తాయి జాగ్రత్తగా”
ఎందుకైనా మంచిది
పాత చెప్పుల జతను
దాచి ఉంచుకొమ్మని……
శ్రీ సాహితి, 9704437247

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -