- Advertisement -
ఒక క్షణం ఖరీదు ఎంత?
ఒక రోజు విలువ ఎంత?
ఒక ఆయువు అంత
ఒక నిండు నూరేళ్ల జీవితమంత
ఒక రూపాయి అంత
ఒక కోటి రూపాయలంత
ఎంత?
ఒక జీవితం పరుగంత
ఒక భూగోళమంత
ఒక నవ్వంత, ఒక దుఃఖమంత
గుండె గాయమంత ,నిమిరే ప్రేమంత,
కలిసిన బంధం అంత, వీడిన బాధంత,
ఎంత?
ఏ కష్టానికి పోయి సంపాదించగలం
ఏ కొండను తవ్వి పట్టుకురాగలం
ఏ సంద్రాన్ని ఈది సంపాదించగలం
ఏ గోవు పాలు పితికి తీయగలం
ఏ చెట్టు కొమ్మ పూస్తే తెంపుకు రాగలం
ఏ మేఘం వర్షిస్తే పట్టుకోగలం
ఏ యుద్ధం చేసి గెలవగలం
ఏ ముత్యంతో,వజ్రంతో కొనగలం
ఇటు నుంచి అటు నుంచి
ఎటు నుంచి తేగలం ?
జీవిస్తున్నంత క్షణం జీవితమంత క్షణం
గుండెల్లి ఇస్తారి, 9849983874
- Advertisement -



