రాలేరా అంటే రాలేరు
రావడానికి మొదటి గడప ఆనకట్ట దాటాలి
దాటడానికి ఇంటి పెద్ద మాటలేకున్నా
ఒంటికన్ను అనుమతైనా కావాలి
ఎప్పుడూ కనబడని సిసి కెమెరాలాంటి
ఆడపులి ఆజ్ఞను చివరిదాకా
కొంగు పరిచి ఎదురు చూడాలి
నమ్మకంతో నడచి వచ్చినదైనా
పొమ్మని ఎపుడైనా అంటే గింటే
చీకటికి ముందే
వాడిపోకుండా రమ్మని చూపులతో చెప్తాడని
మేకప్పులు పై కప్పులు
కట్లు బొట్లు సిద్దమై
పో…. అనే ఏకాక్షరం కోసం
వలను ఆశతో చూసే వేటగానిలా చూస్తే
వద్దు అనే గేటు దూలం పడి
తల రెండు ముక్కలైనట్లు
ఇప్పుడే వస్తా మా ఫ్రెండ్ ఇంటికి
పిలువంగనే వస్తా పక్కింటికి
మీటింగుకు మార్కెటకు ఎక్కడికెళ్లినా
ఎన్ని ఎదురు చూపులు
ఎందుకు అనే ఎన్ని ప్రశ్నల తాకుడు రాళ్లు
ఐదేళ్ళ పిల్లడినుంచి పండువయసోడి దాకా
హద్దులు లేని అనుమతులు
కానీ ఆమె ఒక తల్లి, చెల్లె, ఇల్లాలు
ఐతే మాత్రం ఆమె ఆడది కదా
అందులో భారతీయ స్త్రీ కదా.
డా. ఉదారి నారాయణ, 9441513666.
రాలేరా
- Advertisement -
- Advertisement -



