Wednesday, June 10, 2026
E-PAPER
Homeసినిమాఎక్కువ సినిమాలు వస్తేనే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుంది

ఎక్కువ సినిమాలు వస్తేనే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుంది

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం అలాగే అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో ఓ కార్యక్రమం జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఏపీ ఎఫ్డిసీ నూతన చైర్మన్ గా ఎన్నికైన భరత్ భూషణ్, అలాగే ఇతర సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసీ చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ, ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా కర్తవ్యం నిర్వహిస్తాను. 1984లో నందమూరి తారక రామారావు ఒక కమిటీ వేసి సినీ పరిశ్రమలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బాలకృష్ణ సహకారంతో ఈ కమిటీను పూర్తి స్థాయిలో నిర్మించారుఅని తెలిపారు. నటుడు సుమన్, నటి ఝాన్సీ, దర్శకుడు మెహర్ రమేష్, రచయిత బొర్రా సాయి మాధవ్, నాటక రంగం నుండి కందిమల్ల సాంబశివరావు, దర్శక, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితరులు ఈ వేడుకలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, 'గత ప్రభుత్వ సమయంలో ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు అలాగే కళలకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. వాటికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఏపీఎఫ్డీసీని ఏర్పాటు చేసింది. అలాగే నంది అవార్డులు కార్యక్రమం కొనసాగించే దిశగా ఉన్నాము. తెలుగు సినిమాలతో పాటు ఇతర సినీ పరిశ్రమ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి షూటింగులు చేసుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ సినిమాలు చేసేవారికి అండగా నిలుస్తుంది, అని సౌకర్యాలు ఇస్తుంది. భవిష్యత్తులో ఈ ఎఫ్డిసితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు మరింత కృషి చేస్తుంది అని తెలిపారు.

ప్రస్తుతం సినిమాను బతికించాల్సిన పరిస్థితుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉంది. సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ సినిమాలు రావాలి. థియేటర్లు, ప్రేక్షకులకు వాటిని అందించాలి. కష్టాలు వచ్చినప్పుడు అందరం ఒక కుటుంబంలా కలిసి కూర్చొని సమస్య పరిష్కరించి, ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సాధారణంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి సినిమాలకు కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీలో అనేక ప్రాంతాల్లో నా సిని మాలు షూటింగ్‌లు జరుపుకొన్నాయి. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం సహా అనేక ప్రాంతాలు షూటింగ్‌లకు అనుకూలం. సమస్యలు పరిష్కరిం చడం సహా, ఫిల్మ్‌ డెవలప్‌ కార్పొరేషన్‌ ద్వారా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు, థియేటర్ యజమానులను చూస్తుంటే జాలేస్తుంది, తాళాలు వేసుకొని వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి తగిన కృషి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన సహకారం అందించాలని తప్పక కోరతాం`.
బాలకృష్ణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -