Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం

ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం

- Advertisement -

గాజాకు వెళ్తున్న మానవతా సహమీద
కాన్వాయ్‌ మీద దుశ్చర్యపై ఆగ్రహం
పారిస్ : గాజాకు వెళ్తున్న మానవతా సహాయ కాన్వాయ్‌ లో ఇజ్రాయిల్ దళాలచే పట్టు బడి, నిర్బంధంలో ఉన్న కార్య కర్తలను ఎగతాళి చేసినందుకు, ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్‌పై ఫ్రాన్స్ శనివారం అధికారిక ప్రవేశ నిషేధాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయిల్ దళాలు అడ్డగించిన విదేశీ కార్యకర్తల కఠినమైన నిర్బంధ పరిస్థితులను ఆ ఫుటేజ్ స్పష్టం చేసింది. ఆ రికార్డింగ్‌లో, డజన్ల కొద్దీ నిర్బంధితులను మోకాళ్లపై గట్టిగా కూర్చోబెట్టి, వారి నుదుళ్లను నేలకు అదిమిపట్టి, చేతులకు జిప్-టైలు వేసి బంధించారు.

“ఇజ్రాయిల్‌కు స్వాగతం” అనే శీర్షికతో ఉన్న ఆ క్లిప్‌లో, బెన్ గ్విర్ ఇజ్రాయిల్ జెండాను ఊపుతూ కార్యకర్తలను హేళన చేయడం కనిపించింది. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ మాట్లాడుతూ, ఇటలీతో పాటు పారిస్ కూడా ఇజ్రాయిల్ మంత్రిపై యూరోపియన్ యూనియన్ వ్యాప్త ఆంక్షల కోసం ఒత్తిడి చేస్తోందని తెలిపారు. “మానవతా సహాయ నౌకాదళంలో భాగమైన ఫ్రెంచ్, యూరోపియన్ పౌరుల పట్ల అతని హేయమైన చర్యల” కారణంగా, ఇటామర్ బెన్ గ్విర్ ఫ్రెంచ్ భూభాగంలోకి ప్రవేశించకుండా నిషేధించినట్టు బారోట్ ఎక్స్ లో పోస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -