Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ?

పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ?

- Advertisement -

లేబర్ కోడ్‌లు రాష్ర్టంలో అమలు చేయకుండా తీర్మానం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష‍ులు 
చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతిఁధి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ మెదక్ జిల్లా సమావేశం సంగారెడ్డిలో జరిగింది. జిల్లా అధ్యక్ష‍ురాలు బాలమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరి తాళ్లుగా మారాయని అన్నారు. రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని అన్నారు. కనీస వేతనం లెక్కించాలంటే కార్మికుల కుటుంబ కనీస అవసరాలు పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయలేదన్నారు. కాంట్రాక్టు లేబర్ జీవో 11 ప్రకారం రాష్ట్రంలో రూ.13,098 నుండి రూ.23,683 వేతనాలు పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు స్వల్పంగా పెరిగాయి తప్ప ప్రభుత్వం చెపుతున్నట్టు గణనీయంగా పెరగలేదని అన్నారు. కనీస వేతనం రూ. 26వేలకు పెంచాలఁ డిమాండ్ చేశారు. మే 30 న సీఐటీయూ 56వ వ్యవస్థపాక దినోత్సవం సందర్బంగా గ్రామ గ్రామాన, పారిశ్రామిక ప్రాంతాలు, యూనియన్స్ దగ్గర సీఐటీయూ జెండాలు ఆవిష్కరణ చేయాలని పిలుపుఁచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -