Monday, May 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంకుశాపూర్‌లో వడదెబ్బతో వ్యక్తి మృతి..

అంకుశాపూర్‌లో వడదెబ్బతో వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ-కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సైద్ ఖాన్ (42) వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తీవ్ర ఎండల కారణంగా అస్వస్థతకు గురైన సైద్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

మృతుడు మహమ్మద్ సైద్ ఖాన్‌కు భార్యతో పాటు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణకు అండగా నిలిచిన వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు, బంధువులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -