- Advertisement -
నవతెలంగాణ-మల్హర్‌రావు: జాతీయ మహిళ దినోత్సవంలో భాగంగా మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య అధ్యక్షతన అంగన్ వాడి సూపర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహళలు,కిశోర బాలికల,పిల్లల పోషక స్థితిని మెరుగు పరచడం,పోషకాహర లోపం,రక్తహీనత,ఎదుగుదల లోపం,తక్కువ బరువుతో పుట్టె శిశువుల సమస్యలపై అవగాహన నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవ కార్యాచరణ,మహిళల భద్రతకు,ఆహార పధార్థాలతో ఆరోగ్యకరమైన పోషణ విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.అనంతరం ఆయాలు,టీచర్లతో ప్రతిజ్ఞ చేయించారు.
- Advertisement -


