Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యతోపాటు, అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడిచెర్ల కళాశాల

విద్యతోపాటు, అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడిచెర్ల కళాశాల

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో 2008 సంవత్సరంలో అరకొర వసతులతో సొంత భవనం లేక హైస్కూల్లో కేవలం ఒకే ఒక్క సిఈసి గ్రూపుతో ప్రారంభమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల నేడు సొంత భవనంతో సైన్సు మరియు ఆర్ట్స్ గ్రూపులతో2026 పరీక్ష ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి ప్రిన్సిపాల్ విజయ దేవి కృషితో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జిల్లా కలెక్టర్, మండల ప్రజా ప్రతినిధుల చొరవతో అభివృద్ధిలో కళాశాలకు నూతన నూతన శోభ సంతరించుకుంది. కళాశాలలో జరిగిన అభివృద్ధి పనులు పరిశీలిస్తే కళాశాల చుట్టూరా ప్రహరి గోడ, తరగతి గదులు వరండాలో ఫ్లోరింగ్, కళాశాల లోని గ్రౌండ్ లెవెలింగ్,కళాశాల ముఖద్వారం నుండి కళాశాల వరకు సిమెంట్ రోడ్డు, వాహనాలు నిలపడానికి పార్కింగ్ షెడ్ అలానే ఇంటర్మీడియట్ బోర్డు అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో కళాశాలలోని మైనర్ రిపేరింగ్ లో భాగంగా నూతనంగా విద్యుత్ వైరింగ్, శానిటరీ కళాశాలకు పెయింటింగ్, మంచినీరు తాగడానికి ఆర్ఓ ప్లాంట్ ఇలా చాలా అభివృద్ధి పనులు జరిగాయి.

విద్య బోధనలో ఎక్కడ రాజీ పడకుండా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తూ..నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వార్షిక పరీక్షల వరకు దాతల సహాయంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగిందని ప్రిన్స్ పాల్ తెలిపారు. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి/మార్చి లో జరిగిన వార్షిక పరీక్ష ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతిని పొందడం జరిగిందన్నారు. అలానే ఎంపిసి మొదటి సంవత్సరం విద్యార్థి పన్నాల సాత్విక రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిందన్నారు. చాలమంది విద్యార్థులు ఎంసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి టాప్ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీలో సీట్లు సాధించినట్లుగా తెలిపారు. మొదటి సంవత్సరం ప్రవేశాలలో గత సంవత్సరం కంటే ఈ 2026-27 సంవత్సరం 20% ప్రవేశాలు పెరిగాయన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రిన్సిపల్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -