Tuesday, May 26, 2026
E-PAPER
Homeవరంగల్గ్రామ సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ

గ్రామ సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్య భాగంగా మండలం ఇప్పలపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో రూ.10 లక్షల ఈజిఎస్ నిధులచే గ్రామైక్య సంఘ కార్యాలయ భవన నిర్మాణానికి మంగళవారం ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,సర్పంచ్లు అబ్బినేని లింగస్వామి, కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ లచే భూమి పూజ నిర్వహించడం జరిగిందని మండల ఏపీఎం హనుమంతరావు తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలో ఆన్సాన్పల్లి,నాచారం,ఎడ్లపల్లి,కొండంపేట,ఇప్పలపల్లి,వల్లెంకుంట, పెద్దతూoడ్ల,కొయ్యుర్ గ్రామాల్లో ఈజిఎస్ నిధులతో ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షలతో మొత్తం 8 గ్రామ సమైక్య భవనాలు మంజూరైనట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి,వార్డు సభ్యులు అక్కల మహేష్,శనిగల లత,బొల్లం నాగమణి,కుంభం ముకుంద రెడ్డి,గ్రామ సమైక్య అధ్యక్షురాలు లావణ్య,కోడారి చిన మల్లయ్య, కొండూరి మమత,అక్కల రాము,రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -