నవతెలంగాణ-మల్హర్రావు: తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క 27వ వర్థంతి మండలం కొయ్యూరు గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల ప్రజా సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన పాట,మాటతో సబ్బండ వర్గాలను, కులాలను, చైతన్యం చేస్తూ తెలంగాణ పల్లెల్లో ఉద్యమ జ్వాలను రగిలించిన తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క, తెలంగాణ ధీర వనిత బెల్లి లలితక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగామ జనార్ధన్,కుల ప్రజా సంఘాల జిల్లా కో కన్వీనర్ అయితే బాపు,మండల కన్వీనర్ దేవి భూమయ్య, కో కన్వీనర్ గడ్డం లచ్చన్న,బోయిని రాజన్న,యాదండ్ల గట్టయ్య,వేల్పుల నారాయణ,యాట్ల శంకర్,సదానందం పాల్గొన్నారు.



