నవతెలంగాణ-కంఠేశ్వర్: చిన్నారులు అప్రమత్తతో ఉండాలని లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ సూచించారు. రామ కృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నగరంలోని గంగస్తాన్ గల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం రోజు జిల్లా న్యాయ అధికార సేవ సంస్థ నిర్వహించిన బాలల చట్టాల పై అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ.. విద్యార్థులు కుటుంబ వ్యవస్థలో బాల బాలికలు మానవ శరీరం మీద గుడ్ టచ్ బాడ్ టచ్ అవగాహనతో ఉండాలని చిన్నారులు అనుమానస్పద వ్యక్తుల వ్యవహార శైలి పట్ల అప్రమత్తతతో ఉండాలని అపరిచిత వ్యక్తుల ప్రలోభాలకు లొంగద్దు వారి ప్రవర్తన పట్ల తల్లిదండ్రులకు తెలియజేయాలి సూచించారు. మైనర్ పిల్లల వేధింపులకు గురి అయినప్పుడు నిందితుల పట్ల ఫోక్సు చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి సెల్ ఫోన్ విచిత్రికలలో అప్రమత్తతో ఉండాలని పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలని విపత్కర పరిస్థితుల్లో ధైర్యంతో తమంతట రక్షణ తో ముందుకు సాగాలని పేర్కొన్నారు. బార్ అసోసియన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతిక విలువలు తో విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పానెల్ అడ్వకేట్ రంజీత్ సుతారే ఫారా లీగల్ వాలంటీర్ జీవన్ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయిప్రసాద్, సంస్థ ప్రతినిధి గోపాల్, దేరీన్ వసంత్, గంగాధర్ కిశోర్,వి న్యాయసేవ సంస్థ ప్రతినిధి నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.



